ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే అది కొన్ని రోజుల తర్వాత ముగిసిపోతుంది. అప్పుడు ఆంక్షలను ఎత్తివేస్తారు. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా చాలాకాలం పాటు జనం భౌతిక దూరం పాటిస్తారని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన… ముఖ్యంగా రెస్టారెంట్లు ఆ తర్వాత కూడా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు.
ఈ క్రమంలో కరోనా కారణంగా విధించిన సోషల్ డిస్టెన్స్ రూల్స్ కొనసాగినప్పటికి కూడా తమ వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నెదర్లాండ్స్ కు చెందిన ఓ ఆర్ట్ సెంటర్ చేసిన కొత్త ఆలోచన అందరినీ ఆకట్టుకుంటోంది. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్ స్టర్ డ్యామ్ లోని ఓ ఆర్ట్ సెంటర్….సోషల్ డిస్టెంట్ డైనింగ్ కోసం గ్రీన్ హౌస్ లను పరీక్షిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి 16 నుండి మూసివేసిన రెస్టారెంట్లను తిరిగి ఓపెన్ చేసేందుకు డచ్ అధికారులు రెడీ అవుతున్నారు. ఈ సమయంలో డిన్నర్ లను ఓ బ్యాక్స్ లా ఉండే చిన్న గ్రీన్ హౌస్ లలో తినే కొత్త మార్గాన్ని పరీక్షిస్తోంది ఆమ్ స్టర్ డ్యామ్ ఆర్ట్ సెంటర్.
ఈ గ్రీన్ హౌస్ లు చిన్న గాజు ఇళ్ళ మాదిరిగా ఉంటాయి. లోపల ఒక రౌండ్ టేబుల్ ఉంటుంది. రెండు కుర్చీలతో ఇద్దరు మాత్రమే కూర్చునేలా ఉంటుంది. వాస్తవానికి ఫుడ్ సర్వీస్ చేసే సిబ్బంది లోపలికి రావడానికి కూడా సరిపోనంత చిన్నవిగా ఈ గ్రీన్ హౌస్ లు ఉంటాయి. గ్రీన్ హౌస్ ల బయట నుండి వెయిటర్లు ఫుడ్ ని లోపలున్నవారి చేతికి అందిస్తారు. అంతేకాకుండా ముందుజాగ్రత్తగా వెయిటర్లు వారి ముఖాలకు ప్రొటెక్టివ్ గేర్ ధరిస్తారు.
రెస్టారెంట్లు రీపెన్ చేయబడిన తర్వాత డిన్నర్ కోసం వెళ్లాలని కోరుకునే వ్యక్తులకు ఈ గ్రీన్ హౌస్ రెస్టారెంట్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయంటున్నారు నిపుణులు.
