బ్రిటన్ రాణికి కరోనా పాజిటివ్

బ్రిటన్ రాణికి కరోనా పాజిటివ్

బ్రిటన్ రాణి ఎలిజబెత్- II(95)కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల నుంచి స్వల్ప లక్షణాలతో ఉన్న ఆమెకు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చినట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ వెల్లడించింది. రాణి ఎలిజబెత్‌ జలుబు, తేలికపాటి జ్వరం మాత్రమే ఉన్నట్లుగా ప్యాలెస్ తెలిపింది.   ఎలిజబెత్ తన విండర్స్ కాజిల్ నివాసంలో ఉన్నారని తెలిపింది.ప్రస్తుతానికి డాక్టర్ల పర్యవేక్షణలో బ్రిటన్ రాణికి ట్రీట్ మెంట్ అందిస్తున్నారని వెల్లడించింది. కొన్ని రోజుల క్రితమే ఆమె పెద్దకుమారుడు ప్రిన్స్ చార్లెస్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే రాణి తన అధికారిక బాధ్యతలను కుదించుకున్నారని తెలిపారు. రాణి కొన్ని రోజుల క్రితమే కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. 

చావడానికైనా సిద్ధమే కానీ తలవంచను

సూడో జాతీయ విధానాన్ని అడ్డుకోవడమే లక్ష్యం