టీఎస్​పీఎస్సీ కుళ్లిపోయింది..అద్దంకి దయాకర్

టీఎస్​పీఎస్సీ కుళ్లిపోయింది..అద్దంకి దయాకర్

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ మొత్తం కుళ్లిపోయిందని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్​ విమర్శించారు. శనివారం ఆయన మరో అధికార ప్రతినిధి రియాజ్​తో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు వాయిదా వేస్తే రెండు నెలల వరకు పరీక్ష పెట్టడం కుదరదంటూ టీఎస్​పీఎస్సీ లీకులిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఆఫ్​లైన్​లో రాసే పరీక్షకు సెంటర్ల సమస్య ఎందుకు వస్తదని ప్రశ్నించారు.

 ప్రెస్​మీట్ పెట్టినా అరెస్ట్​ చేస్తామంటూ పోలీసులు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలను కలిసేందుకు కమిషన్​ చైర్మన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఆలోచన టీఎస్​పీఎస్సీకి లేనే లేదని రియాజ్ మండిపడ్డారు. పేపర్​లీకులు, గందరగోళం మధ్యనే పరీక్షలను నిర్వహిస్తున్నారని విమర్శించారు.