ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు : మల్లురవి

ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు : మల్లురవి

రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అణిచివేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రులకు దక్కని కేసీఆర్ దర్శనం.. ఢిల్లీలో లభించిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం త్వరలోనే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఎలాంటి సమయం ఇవ్వని కేసీఆర్..చివరకు మంత్రులకు, సొంత పార్టీ నేతలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్ష నాయకులను చూడ్డానికి ఇష్టపడని కేసీఆర్ ఢిల్లీలో సర్వ దర్శనాలన్నీ ఒకేసారి అన్నట్లు మంత్రులతో పాటు అందరికీ ఒకేసారి సమయం ఇచ్చారని మల్లురవి విమర్శించారు.

రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నీ అబద్దాలు చెప్పి వెళ్లారని కాంగ్రెస్ నేత మల్లు రవి విమర్శించారు. ‘మీ సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది’ అని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, తామే అధికారంలోకి రాబోతున్నామని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు.