‘మా’లో విభేదాలు: ముగిసేనా? ముదిరేనా?

‘మా’లో విభేదాలు: ముగిసేనా? ముదిరేనా?

అత్యంత ఆసక్తిని రేకెత్తించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు  ఎట్టకేలకు ముగిశాయి. ఈ ఎలక్షన్‌లో సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్‌‌‌పై హీరో విష్ణు విజయం సాధించారు. ఎన్నికకు ముందు బరిలో నిలిచిన రెండు ప్యానెళ్ల సభ్యులు సాధారణ ఎన్నికల స్థాయిలో వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగడం టాలీవుడ్‌ను హీటెక్కించింది. అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుందని, అంతా సద్దుమణుగుతుందని అందరూ భావించారు. కానీ ‘మా’లో విభేదాలు మరింత తీవ్రమయ్యేలా ఉన్నాయి. ఎలక్షన్‌ ఫలితాల తర్వాత ఓడిపోయిన ప్రకాశ్ రాజ్‌తోపాటు ఆయనకు బహిరంగంగా మద్దతు తెలిపిన మరో నటుడు నాగబాబు ‘మా’ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేయడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. వీరితో పాటు మరికొందరు సభ్యులు ‘మా’ సభ్యత్వానికి రిజైన్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. అసోసియేషన్‌లో చీలిక వచ్చినా సందేహం అక్కర్లేదని పలువురు అనుమానిస్తున్నారు. మరి, ఎలక్షన్‌తో ‘మా’లో చెలరేగిన ఈ వివాద తుఫాను.. ఎన్నికల తర్వాత రెండు రాజీనామాలతోనే ముగుస్తుందా లేదా మరింతగా ముదురుతుందా అనేది చూడాలి. 

మరిన్ని వార్తల కోసం: 

మీరో అద్భుతం.. ఎప్పుడూ ఇలాగే ఉండాలి

‘మా’ కు ప్రకాశ్‌ రాజ్ రాజీనామా

ఎలిమినేటర్ పోరులో గెలిచేదెవరో?