మీరో అద్భుతం.. ఎప్పుడూ ఇలాగే ఉండాలి

మీరో అద్భుతం.. ఎప్పుడూ ఇలాగే ఉండాలి

ముంబై: బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ సోమవారంతో 79వ పడిలోకి అడుగు పెట్టారు. 1969లో సాత్ హిందుస్థానీ మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసిన అమితాబ్.. ఈ 52 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇప్పటికీ ప్రతి ఆదివారం అమితాబ్‌ను చూడటానికి ఆయన ఇంటి (జల్సా) ముందు వందలాది మంది గుమిగూడటాన్ని బట్టి ఆ ఛరిష్మా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ వయస్సులోనూ అమితాబ్ ఛాలెంజింగ్ స్క్రిప్ట్‌లు ఎంచుకుంటూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నారు. లక్షలాదిగా ఉన్న తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉండేందుకు సోషల్ మీడియాను బాగా వాడుతుంటారు. అమితాబ్ బచ్చన్ జీవితంపై డైరెక్టర్ ఖలీల్ మొహ్మద్ ఓ పుస్తకాన్ని రాశారు. టూ బీ ఆర్ నాట్ టూ బీ పేరిట ప్రచురించిన ఈ పుస్తకాన్ని.. అమితాబ్ 60వ పుట్టిన రోజున విడుదల చేశారు. కాగా, బిగ్ బీ బర్త్ డేను పురస్కరించుకుని పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

‘నేను అమితంగా ప్రేమించే నా పెద్దన్నయ్య, ప్రియమైన గురువు అమిత్ జీకి హ్యాపీ బర్త్ డే. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి’ అని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 

‘హ్యాపీ బర్త్ డే పాపాజీ. మీరు నిజంగా ఓ అద్భుతం. మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మంచి మానవతా మూర్తి అయిన మీకు ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని క్యూట్ హీరోయిన్ రష్మికా మందన్నా ట్వీట్ చేసింది. 

‘అమితాబ్ జీకి హ్యాపీ బర్త్ డే. మీ అసామాన్య ప్రతిభతో మాలో ఇలాగే స్ఫూర్తి నింపుతూ ఉండండి’ అని సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

‘మా’ కు ప్రకాశ్‌ రాజ్ రాజీనామా

ఎలిమినేటర్ పోరులో గెలిచేదెవరో? 

ఆర్యన్ ఖాన్ కేసు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా