
మా సభ్యత్వానికి రాజీనామా చేశారు ప్రకాశ్ రాజ్. ప్రాంతీయ వాదం ,జాతీయ వాదం మధ్య మా ఎన్నికలు జరిగాయని.. ప్రాంతీయ వాదం గెలిచిందన్నారు. మా సభ్యులు తెలుగువాడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్నారు. మా వేరు ఇండస్ట్రీ వేరన్నారు. ఒక అథితిగానే ఉండాలంటే ఎలా అని ప్రశ్నించారు. తాను తెలుగు వాడిని కాదని.. గెస్ట్ గా వచ్చానని.. గెస్ట్ గానే ఉంటానన్నారు. గెలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన హామీలను విష్ణు నెరవేర్చాలన్నారు. మా ఎన్నికల్లో ప్రాంతీయ వాదం తీసుకొచ్చారన్నారు. తెలుగు వాడిని కాదని తనను ఓడించారన్నారు. లోకల్ నాన్ లోకల్ అజెండాల మధ్య తాను ఉండలేనన్నారు.
మా తో తనకు 21 ఏళ్ల అనుభందం ఉందన్నారు. ఇతర భాష వాళ్లు పోటీచేయకుండా బై లాస్ తెస్తామన్నారని..అందుకే తాను రాజీనామా చేశానన్నారు. తాను మా సభ్యుడిగా ఉండటంలో అర్థం లేదన్నారు. ఇది తన ఆత్మగౌరవం అన్నారు. తెలుగులో నటించడం కొనసాగిస్తానన్నారు. మా సభ్యత్వం లేకుంటే సినిమాల్లో నటించనివ్వరా అని ప్రశ్నించారు. బండి సంజయ్ ట్వీట్ పై స్పందించిన ప్రకాశ్ రాజ్.. జాతీయవాదంతో ముడిపెట్టారని..ఇది తనను చాలా బాధ కల్గించిందన్నారు.
"మా" అధ్యక్షుడిగా గెలిచిన @iVishnuManchu గారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికి శుభాకాంక్షలు.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2021
జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన "మా" ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది.#MaaElections2021