శ్రీశైలానికి కన్నడ భక్తుల క్యూ

శ్రీశైలానికి కన్నడ భక్తుల క్యూ

శ్రీశైలం, వెలుగు :  శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ వేడుకలను చూసేందుకు వేల మంది కన్నడ భక్తులు కాలినడకన నల్లమల అడవి గుండా తరలివస్తున్నారు. కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా దేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. అందుకే భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం కోసం వెంకటాపురం నుంచి దట్టమైన అటవీప్రాంతం నుంచి సుమారు 40 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వస్తారు. వీరికి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చూసుకుంటోంది. మార్గమధ్యలో మంచినీరు, వైద్య సౌకర్యాలు కల్పించడం, అటవీ మార్గంలో రాళ్లు రప్పలు లేకుండా చూడడం, ట్రాక్టర్లతో నీళ్లు చల్లించడం, అన్నదానం వంటి ఏర్పాట్లను చేశామని ఈవో ఎస్.లవన్న తెలిపారు. మరోవైపు దాతలు కూడా మజ్జిగ, పండ్లు పంచడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు.