
హైదరాబాద్, వెలుగు: నాలెడ్జ్ సిటీలో మొదటిసారిగా డిస్ట్రిక్ట్150 ని ఈ ఏడాది మూడో క్వార్టర్లో లాంఛ్ చేయనున్నట్లు కోరమ్ క్లబ్వెల్లడించింది. లైఫ్‌స్టైల్ ఫోకస్‌తో మీటింగ్ ఈవెంట్స్ నిర్వహించుకోవడానికి డిస్ట్రిక్ట్150 చాలా అనువుగా ఉంటుందని పేర్కొంది. రాబోయే అయిదేళ్లలో దేశవ్యాప్తంగా 8 నుంచి 10 డిస్ట్రిక్ట్150 హబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు కోరమ్ క్లబ్ సీఈఓ వివేక్ నారాయణ్ వెల్లడించారు.
హోటల్స్‌లో కాకుండా వేరే చోట్ల మీటింగ్‌లు, ఈవెంట్లు నిర్వహించుకునే సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఆఫీసులు, ఆఫీసు బిల్డింగ్లు ఇక్కడ సరిగ్గా సరిపోతాయని, అందుకే లైఫ్‌స్టైల్ ఫోకస్డ్ మీటింగ్, ఈవెంట్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పనికి, సోషలైజింగ్‌కు అవకాశమిచ్చేలా తమ డిస్ట్రిక్ట్స్ 150 లను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.