
- సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తనిఖీ చేసిన డీఐజీ
జీడిమెట్ల, వెలుగు: సూరారంలోని కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌ను రిజిస్ట్రేషన్ అండ్‌స్టాంప్స్ డీఐజీ మధుసూదన్ గురువారం తనిఖీచేశారు. కుత్బుల్లాపూర్‌లో 41 గుంటల వక్ఫ్‌భూమి ఉందని, కొంతకాలంగా 171 సర్వే నెంబర్లలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. దీంతో అనేక కాలనీల ప్రజలు క్రయవిక్రయాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. స్పందించిన డీఐజీ మధుసూదన్ జిల్లా రిజిస్ట్రార్ అశోక్‌తో కలిసి తనిఖీ చేశారు. పలు విషయాలను ఆఫీస్‌లోని అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.