
శుక్రవారం వచ్చిందంటే సినిమాల పండుగ మొదలైనట్టే. అలా ప్రతివారం వచ్చే శుక్రవారం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా థియేటర్స్, ఓటీటీలల్లో కొత్త సినిమాల దర్శనంతో తెగ సంబరపడుతుంటారు.
నేడు శుక్రవారం మే9న థియేటర్స్ లోకి సమంత నిర్మించిన శుభం, శ్రీ విష్ణు సింగిల్, చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ వచ్చి సందడి చేస్తున్నాయి. ఈ సినిమాల పాజిటివ్ టాక్తో ప్రేక్షకులు ఖుషి అవుతున్నారు.
ఈ క్రమంలో నేను ఏ మాత్రం తక్కువ కాదంటూ ఓటీటీ కూడా కొత్త సినిమాలు తీసుకొచ్చింది. ఇవాళ ఒక్కరోజే 10కి పైగా సినిమాలు, సిరీస్ లు అందుబాటులోకి తెచ్చింది. మరి ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? ఏది ఇంట్రెస్టింగ్గా ఉండనుంది? అనే వివరాలు చూద్దాం.
ఆహా:
అపరాధి (మలయాళ సీరియల్ కిల్లర్)-మే8
అస్త్రం (తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)-మే9
అమెజాన్ ప్రైమ్:
గ్రామ చికిత్సాలయ్ (హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)-మే9
ఓదెల 2 (తెలుగు హార్రర్ థ్రిల్లర్)-మే8
SUN NXT:
కాలమేగా కరిగింది? (తెలుగు రొమాంటిక్ డ్రామా)-మే9
నెట్‌ఫ్లిక్స్:
ది రాయల్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ వెబ్ సిరీస్)-మే9
ది డిప్లమాట్ (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ థ్రిల్లర్ )-మే9
నొన్నాస్ (అమెరికన్ కామెడీ)-మే9
ఏ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ (ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ)-మే9
మాలా ఇన్‌ఫ్లుయెన్సియా (స్పానిష్ రొమాంటిక్ థ్రిల్లర్)-మే9
జాక్ (స్పై యాక్షన్ కామెడీ)-మే8
గుడ్ బ్యాడ్ అగ్లీ (యాక్షన్ థ్రిల్లర్)-మే8
ఈటీవీ విన్
అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి (తెలుగు కామెడీ డ్రామా)-మే8
జియో హాట్‌స్టార్
పోకర్ ఫేస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)-మే9
యాపిల్ ప్లస్ టీవీ:
లాంగ్ వే హోమ్ (ఇంగ్లీష్ రోడ్ జర్నీ వెబ్ సిరీస్)-మే9