
మలయాళ నటుడే అయినా సౌత్‌లో సూపర్బ్ పాపులారిటీ తెచ్చుకున్నాడు ఫహాద్ ఫాజిల్. ‘పార్టీ లేదా పుష్పా’అనే డైలాగ్‌తో తెలుగులో తన ఇమేజ్‌ను మరింత పెంచుకున్నాడు. అలాగే పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో నటించి తనదైన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశాడు ఫహాద్. దీంతో ఆయన లీడ్ రోల్‌లో నటించిన చిత్రాలకు తెలుగులోనూ క్రేజ్ పెరిగింది.
ఫహాద్, దర్శన రాజేంద్రన్ జంటగా నటించిన మలయాళ మూవీ ‘ఇరుల్’ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాలుగేళ్ల క్రితం మలయాళంలో విజయం సాధించిన ఈ చిత్రం గురువారం మే8న నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
‘అపరాధి’టైటిల్‌తో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ హారర్ థ్రిల్లర్ తెలుగు ఆడియెన్స్‌కు కూడా నచ్చుతుందని మేకర్స్ చెప్పారు. నసీఫ్ యూసుఫ్ ఇజుద్దిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆంటో జోసెఫ్, జామన్ టి జాన్, షమీర్ మహ్మద్ కలిసి నిర్మించారు.
కథేంటంటే:
అపరాధి సీరియల్ కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ. కేవలం మూడు పాత్రలతో ఒకే ఇంట్లో ఈ మూవీ సాగుతుంది. కథలోకి వెళ్తే.. అలెక్స్ (సౌబిన్ షాహిర్) ఓ రైటర్ కమ్ బిజినెస్‌మెన్. అప్పుడప్పుడు నవలలు రాస్తుంటాడు. అందులో అతను రాసిన ఓ నవల మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో తాను ప్రేమించిన అమ్మాయి లాయర్ అర్చన పిళ్లై (దర్శనా రాజేంద్రన్)తో సరదాగా టూర్ ప్లాన్ చేస్తాడు.
Also Read : Single X Review: ‘సింగిల్’ X రివ్యూ.. శ్రీవిష్ణు మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?
ఒక వారం ఒంటరిగా ఎక్కడైనా గడపాలని అనుకుంటారు. ఈ ట్రిప్‌కు అలెక్స్, అర్చన కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. ఫోన్స్ తీసుకురాకూడదని, ఏకాంతంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటారు. అలా ఆ ఇద్దరు ట్రిప్ కు బయలుదేరుతారు. చీకటి పడుతుంది. ఇంతలోనే వర్షం కారణంగా, ఓ కొండ ప్రాంతంలో కారు బ్రేక్‌డౌన్ అవుతుంది.
ఇంతలోనే అక్కడ ఓ పాత ఇల్లు కనిపిస్తోంది. ఆ ఇంట్లో ఉన్ని (ఫహాద్ ఫాజిల్) ఒంటరిగా ఉంటాడు. వారు ఆ రాత్రి అక్కడ ఉండటానికి ఆశ్రయం ఇస్తాడు. ఈ క్రమంలోనే ఆ ఇంట్లో ఓ మహిళ డెడ్‌బాడీ అలెక్స్‌కు కనిపిస్తోంది. ఒక్కసారిగా అర్చన భయపడుతుంది. ఇదే టైంలో అలెక్స్ గురించి పలు నిజాలు ఉన్ని ద్వారా అర్చనకు తెలుస్తాయి.
అసలు ఆ ఇల్లు ఉన్నిది కాదని కూడా తెలుసుకుంటుంది. దాంతో కొన్ని కీలక సంఘటనలు ద్వారా ఆ మహిళను చంపిందో ఎవరో అర్చనకి అర్ధమైపోతుంది. మరి ఆ హత్యా చేసింది ఎవరు? ఉన్నినా? లేక అలెక్సా? అక్కడి నుంచి అర్చనా ఎలా బయటపడగలిగింది? అలెక్స్ రాసే నవలలు ఏంటీ? అందులో రాసినట్టే బయట ఎలా జరుగుతాయి? అనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
అపరాధి మూవీ సీరియల్ కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో ఆసక్తి కలిగిస్తోంది. కేవలం మూడు పాత్రలతో ఒకే ఇంట్లో జరిగిన సంగటనలతోథ్రిల్లింగ్ కలిగిస్తోంది. నవలలో రాసినట్టే సీన్స్ జరగడం, మహిళ డెడ్ బాడీ కనిపించడం, ఒకరికొకరు ఉన్ని, అలెక్స్ పోట్లాడటం, వారి మధ్య జరిగే సీన్స్ ద్వారా అర్చన పలు నిజాలు తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా వీరిద్దరిలో హంతకుడు ఎవరనేది చివరి వరకు హోల్డ్ చేసిన విధానం ప్రేక్షకుడికి ఆసక్తి పెంచుతుంది.