Single X Review: ‘సింగిల్’ X రివ్యూ.. శ్రీవిష్ణు మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?

Single X Review: ‘సింగిల్’ X రివ్యూ..  శ్రీవిష్ణు మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?

హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సింగిల్’ (Single).కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్. వెన్నెల కిషోర్​ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ నేడు (2025 మే9న) థియేటర్లోకి వచ్చింది. కార్తీక్ రాజు దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన ఈ మూవీ టాక్ ఎలా ఉంది? X లో ఆడియన్స్ ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు? శ్రీవిష్ణు ఖాతాలో హిట్ పడిందా? లేదా అనేది ఓ లుక్కేద్దాం.

డిఫరెంట్ స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు శ్రీవిష్ణు. ఇందులో భాగంగా ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’వంటి చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పడిందంటూ నెటిజన్స్ నుంచి టాక్ వస్తోంది.

ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, శ్రీ విష్ణు ఎప్పటిలానే తన పెర్ఫార్మన్స్తో అదరగొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. వెన్నెల కిషోర్-హీరో శ్రీవిష్ణు మధ్య వచ్చే ఫన్నీ ఎపిసోడ్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతారని అంటున్నారు. సెకండ్ హాఫ్ లోనూ కామెడీతో పాటు ఎమోషన్, రొమాంటిక్ సీన్లు నచ్చేస్తాయని సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్నారు.  ఎవ్వరి ఉహించని విధంగా క్లైమాక్స్ పోర్షన్ ను డైరెక్టర్ కార్తీక్ డిజైన్ చేసినట్లు టాక్ వస్తోంది. 

'సింగిల్ మూవీ క్లాసికల్ ఎమోషన్స్ తో కూడిన పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌. శ్రీవిష్ణు తన అద్భుతమైన టైమింగ్ & స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా ప్రేక్షుకుల మనసు దోచుకున్నాడు. వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంది. క్లైమాక్స్, ఎవ్వరూ ఉహించని ఒక బ్లాక్ బస్టర్ ఫన్ క్రాకర్' అని X లో ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. 

మరో నెటిజన్ రివ్యూ ఇస్తూ.. "సింగిల్ ఇదోక కామెడీ ఎంటర్టైనర్, ఇందులో ఫన్ మూమెంట్స్ చాలా ఉంటాయి. కానీ ముఖ్యంగా సెకండాఫ్ లో కొన్ని పోర్షన్స్ లో అండర్‌రైట్ చేయబడినట్లు అనిపిస్తుంది. కథాంశం సరళంగా మరియు సూటిగా చెప్పుకొచ్చారు. ఫస్టాఫ్ లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. సెకండాఫ్ లో కూడా కామెడీ మెప్పిస్తుంది. కానీ, ఆ తర్వాత వచ్చే ఎమోషన్ సీన్స్ తో కామెడీ మిస్ అవుతుంది. అసంపూర్ణంగా అనిపించే క్లైమాక్స్. ఓవరాల్ గా శ్రీ విష్ణు మరియు వెన్నెల కిషోర్ తమ కామెడీతో మెప్పించారు. వన్ లైనర్‌ కామెడీ టైమింగ్ తో తమ భుజాలపై సినిమాను మోసుకొచ్చారు. అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ అది అందించే కామెడీ కోసం సింగిల్ తప్పకుండా చూడొచ్చు" అని Xలో రాసుకొచ్చాడు.