టెరిటోరియల్ ఆర్మీని దించండి.. ఆర్మీ చీఫ్కు రక్షణ శాఖ ఆదేశం.. సచిన్, ధోనీ బార్డర్కు వెళ్లాల్సిందేనా..?

టెరిటోరియల్ ఆర్మీని దించండి.. ఆర్మీ చీఫ్కు రక్షణ శాఖ ఆదేశం.. సచిన్, ధోనీ బార్డర్కు వెళ్లాల్సిందేనా..?

పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ తో పాక్ టెర్రర్ క్యాంపులను లేపేసిన భారత్.. అమాయకులపై పాక్ ఆర్మీ దాడులను సీరియస్ గా తీసుకుంది. సామాన్య పౌరులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కేవలం టెర్రరిస్టుల స్థావరాలను ధ్వంసం చేసింది ఇండియా. అదే సమయంలో ‘‘ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోండి.. మేము పౌరులకు హాని కలగకుంగా ఉగ్రమూకలపైనే దాడి చేశాం.. ’’ అని చెప్పినప్పటికీ.. పాక్ వినలేదు.

 భారత్ పై దాడికి దిగేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ దాడులకు తెరలేపింది. దీంతో భారత్ ప్రతిదాడి చేసి పాక్ లోని లాహోర్ సహా ఇతర నగరాలు, సరిహద్దు టెర్రరిస్టుల ఆవాసాలపై బాంబుల వర్షం కురిపించింది. దీంతో గత రెండు రోజులుగా ఇరు దేశాల మధ్య పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. 

ఈ పరిస్థితుల్లో భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యం ప్రతినిమిషం పాక్ తో పోరాడుతున్న తరుణంలో.. టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి దించేందుకు ఆదేశాలు ఇచ్చింది. యుద్ధం తీవ్రమవుతున్న వేళ అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని కూడా దించాలని ఆర్మీ చీఫ్ కు సూచించింది. టెరిటోరియల్ ఆర్మీ రూల్ 33, 1948 ప్రకారం.. టెరిటోరియల్ ఆర్మీ సహకారాన్ని తీసుకోవాలని సలహా ఇచ్చింది. 

ఇండియన్ ఆర్మీ అండర్ లో ఇప్పటి వరకు 32 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్స్ ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, వాయువ్య, సెంట్రల్ కమ్మాండ్స్ తో పాటు అండమాన్ నికోబార్ కమాండ్, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్  (ARTRAC) అందుబాటులో ఉన్నాయి. 

టెరిటోరియల్ ఆర్మీ అంటే:

రెగ్యులర్ ఆర్మీకి సెకండరీ ఆర్మీ ఫోర్స్ గా టెరిటోరిల్ ఆర్మీని పేర్కొంటారు. అంటే పార్ట్ టైమ్ ఆర్మీగా నమోదు చేసుకుని ఫుల్ టైమ్ ఆర్మీతో సమానంగా ట్రైనింగ్ ఇస్తారు. జీతభత్యాలు కూడా ఫుల్ టైమ్ ఆర్మీతో సమానంగా ఉంటాయి. జాతీయ అత్యవసర పరిస్థితులలో వీరు ఆర్మీకి సహకారం అందిస్తుంటారు. అంతర్గత భద్రత విషయంలో కూడా పాల్గొంటుంటారు. 

టెరిటోరియల్ ఆర్మీలో ఉన్న సెలబ్రిటీలు:

టెరిటోరియల్ ఆర్మీలో ధోనీ, కపిల్ దేవ్ సహా పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. ధోనీకి లెఫ్ట్ నెంట్ కల్నల్ (గౌరవ), 2011 పారాచూట్ రెజిమెంట్, 106 TA బెటాలియన్ (పారా) హోదా ఇచ్చారు. కపిల్ దేవ్ కు లెఫ్ట్ నెంట్ కల్నల్ (గౌరవ) 2008 పంజాబ్ రెజిమెంట్ హోదా కల్పించారు. అలాగే క్రికెటర్ సచిన్, కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తదితరులు ఉన్నారు. 

అయితే అత్యవసర పరిస్థితుల్లో టెరిటోరియల్ ఆర్మీలో ఉన్న సెలబ్రిటీలతో పాటు ఇతర సిబ్బంది యుద్ధ సన్నాహాలలో ఉన్న ఆర్మీకి తోడ్పడుతుంది. ఆర్మీ ఆదేశాల మేరకు వీరు విధుల్లోకి చేరాల్సి ఉంటుంది.