
ప్రపంచం గ్లోబలైజేషన్ మార్గంలో ముందుకు నడుస్తున్నాయి. ఈ క్రమంలో కేవలం టాలెంట్ ఉన్న ఉద్యోగులకు మాత్రమే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని కంపెనీలు మాత్రం ప్రాంతం, భాష వంటి అంశాల ఆధారంగా ఉద్యోగులను నియమించుకోవటం ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది.
తాజాగా ముంబైకి చెందిన ఒక కంపెనీ తన రిక్రూట్మెంట్ యాడ్ లో దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తులను ఉద్యోగానికి తీసుకోవటం లేదంటూ తన ఉద్యోగ అర్హతల్లో వెల్లడించింది. అయితే ప్రాంతం ఆధారంగా ఉద్యోగ నియామకాల్లో వివక్ష చూపటంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమౌతోంది. సోషల్ మీడియాలో యూజర్లు జాబ్ రిక్రూట్మెంట్ యాడ్ వివరాల స్క్రీన్ షాట్ షేర్ చేయబడటంతో దుమారం మెుదలైంది.
Also Read : భారత్ వద్దన్నా.. పాకిస్థాన్ కి రూ.8వేల కోట్లు అప్పు ఇచ్చారు...
పైగా సదరు కంపెనీ కేవలం పురుషులను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నట్లు వెల్లడించింది. ముంబై విక్రోలీ ప్రాంతంలో పనిచేసేందుకు ఇద్దరు టెక్కీలు అవసరమని సదరు జాబ్ పోస్టులో వెల్లడించబడింది. కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం అవసరమని, ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉద్యోగం అని కంపెనీ వెల్లడించింది.
ఒక టెక్ ఉద్యోగం విషయంలో ఇలా ప్రాంతీయ విభేదం ఎందుకు చూపుతున్నారంటు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరొకరు నో సౌత్ క్యాండిడేట్ అని ఉండటంపై స్పందిస్తూ సౌత్ ముంబైనా లేక సౌత్ ఇండియా వాళ్లా అంటూ ప్రశ్నించారు. మెుత్తానికి ప్రాంతాల వారీగా ఉద్యోగులను ఇంటర్వ్యూలకు పిలవటం ఏంటి అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ నియామకంలో చూడాల్సింది నైపుణ్యాలే కానీ ఇలాంటి చీప్ బిహేవియర్ మానుకోవాలని వారు అంటున్నారు.