
IMF Loan to Pakistan: భారత్ పాక్ దేశాల మధ్య దాదాపుగా యుద్ధం స్టార్ట్ అయిన వేళ పాక్ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తోంది. ఈ క్రమంలోనే పాక్ అత్యవసరంగా నిధుల కోసం బెయిలౌట్ కోరుతూ అంతర్జాతీయ ద్రవ్యనిధిని సంప్రదించింది. అయితే పాక్ ఈ నిధులను ఉగ్రవాదానికి వినియోగిస్తుందని భారత్ ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ ఐఎంఎఫ్ రుణాన్ని మంజూరు చేయటం గమనార్హం.
ఈ క్రమంలో నిర్వహించిన ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. దీంతో పాకిస్థాన్ కు రూ.8వేల కోట్ల విస్తరించిన రుణ సౌకర్యాన్ని ఐఎంఎఫ్ అందించింది. దీనికి ముందు మార్చి 25న పాక్-ఐఎంఎఫ్ మధ్య 7 బిలియన్ డాలర్ల రుణానికి సంబంధించిన కీలక ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ఐఎంఎఫ్ షరతులకు పాక్ అంగీకరించింది. గడచిన 5 ఏళ్ల కాలంలో ఐఎంఎఫ్ నాలుగు సార్లు బెయిలౌట్ రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించింది.
Also Read : పాక్ యుద్ధం ప్రకటనతో పెరిగిన గోల్డ్
పాక్ నిధులను ఉగ్రవాదానికి వినియోగించటంపై గతంలో కూడా భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు 2.3 బిలియన్ డాలర్ల కొత్త రుణాలను అందించాలనే IMF ప్రతిపాదనను న్యూఢిల్లీ వ్యతిరేకించింది. తాజాగా పాక్ కి రుణ సౌకర్యాన్ని అందించటంపై కూడా భారత్ తన నిరసనను నమోదు చేసింది. సరిహద్దు దాడులకు కారణమైన ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పిస్తూ, మద్దతు ఇస్తున్న దేశానికి నిధులు సమకూర్చడాన్ని భారత్ వ్యతిరేకించింది.