
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా చాలా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. ఆస్ట్రేలియాలో జరగబోయే బిగ్ బాష్ లీగ్ ఆడుతూ బిజీగా మారనున్నాడు. సిడ్నీ థండర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఈ టీమిండియా వెటరన్ స్పిన్నర్ బిగ్ బాష్ లీగ్‌లో ఆడబోయే తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 39 ఏళ్ల అశ్విన్.. డిసెంబర్ 14 నుండి జనవరి 25 వరకు జరగనున్న బిగ్ బాష్ లీగ్ రెండో అర్ధభాగంలో ఆడనున్నాడు. ఇప్పటికే ఐఎల్‌టీ20తో జత కట్టిన అశ్విన్.. జనవరి 4న ఆ టోర్నీ ముగిసిన తర్వాత సిడ్నీ థండర్స్‌తో చేరనున్నాడు.
A landmark move!
— ESPNcricinfo (@ESPNcricinfo) September 25, 2025
R Ashwin has signed with Sydney Thunder for the next two BBL seasons ✍️
Full story: https://t.co/aNsRuYdpl1 pic.twitter.com/xCghkFqelQ
అశ్విన్‌ను వ్యక్తిగతంగా సంప్రదించిన క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్‌బర్గ్.. బీబీఎల్‌లో ఆడే అవకాశాన్ని కల్పించారు. గత నెలలో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత అశ్విన్ విదేశీ లీగ్‌ల్లో ఆడాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే బీబీఎల్ విదేశీ డ్రాఫ్ట్‌లో అశ్విన్ పేరు నమోదు చేసుకోలేదు. దాంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేకంగా అతనికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 2022లో మార్టిన్ గప్టిల్ (మెల్‌బోర్న్ రెనెగెడ్స్)కు ఇలాగే పర్మిషన్ ఇచ్చింది. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నప్పుడు అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
ALSO READ : IND vs WI: సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడితే సరిపోతుందా.. కరుణ్ నాయర్‌కు అగార్కర్ డైరెక్ట్ పంచ్
"సిడ్నీ థండర్ నన్ను ఎలా ఉపయోగించుకుంటారో స్పష్టంగా ఉంది. థండర్ నేషన్ ఆడడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను. జట్టుగా వాళ్ళు నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుండడంతో నాకు ధైర్యంగా ఉంది. డేవ్ వార్నర్ ఆట ఆడే విధానం నాకు చాలా ఇష్టం". అని అశ్విన్ వీడియో ద్వారా అన్నాడు. థండర్ జట్టులో ఇప్పటికే కెప్టెన్ డేవిడ్ వార్నర్, పాట్ కమ్మిన్స్ లాంటి ఆసీస్ ఆటగాళ్లతో పాటు పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ కూడా ఉన్నారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్, క్రిస్ గ్రీన్, సామ్ కాన్స్టాస్ లాంటి స్టార్ ఆటగాళ్లు థండర్ జట్టులో ఉన్నారు. వంటి బలమైన ఆటగాళ్లు ఉన్నారు. అశ్విన్ లాంటి అనుభజ్ఞుడు చేరడంతో సిడ్నీ థండర్ జట్టు పటిష్టంగా మారనుంది.
అశ్విన్ ఇటీవలే విదేశీ లీగ్‌లలో ఆడాలనే తన కోరికను బయట పెట్టిన సంగతి తెలిసిందే. అశ్విన్ ఇప్పటివరకు భారత్ తరపున 106 టెస్టుల్లో 200 ఇన్నింగ్స్ ల్లో బౌలింగ్ చేశాడు. 537 వికెట్లు తీసి భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ విషయానికి వస్తే 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు పడగొట్టాడు. లీగ్‌లో మొత్తం ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తరుఫున ఆడాడు. పంజాబ్‌కు కెప్టెన్‌గా కూడా పని చేశాడు ఈ దిగ్గజ బౌలర్.బ్యాటింగ్ లోనూ మెరిసి 3503 పరుగులు చేశాడు.
Bring on @BBL|15 @ashwinravi99 ⚡️ pic.twitter.com/xtMW39sLL9
— Sydney Thunder (@ThunderBBL) September 25, 2025