పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి:ఆర్.కృష్ణయ్య

పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి:ఆర్.కృష్ణయ్య

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, దేశవ్యాప్తంగా బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్‌‌లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు కేంద్ర బడ్జెట్‌‌లో రూ.2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. 
మంగళవారం ఢిల్లీలోని జంతర్‌‌‌‌ మంతర్‌‌‌‌లో కృష్ణయ్య నేతృత్వంలో బీసీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనలో వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌‌రావ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ అధ్యక్షుడు అంజి తదితరులు పాల్గొని, మాట్లాడారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కృష్ణయ్య మాట్లాడుతూ.. ఏండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న బీసీల సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేపట్టినా కేంద్రం స్పందించడం లేదని మండిపడ్డారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని, రాజ్యాధికా రంలో వాటా ఇవ్వకుండా 75 ఏళ్లుగా అన్యాయం చేస్తూన్నారని మండిపడ్డారు. అందువల్ల వచ్చే అసెంబ్లీ – పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.