బీసీలు అంటే గొర్లు అన్కుంటున్రా : ఆర్. కృష్ణయ్య

బీసీలు అంటే గొర్లు అన్కుంటున్రా : ఆర్. కృష్ణయ్య

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనలో కులాలను కూడా లెక్కించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో బీసీల బిల్లు పెట్టి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేశారు. 

మేము ఎంతో మాకు అంత.. ఓట్లు మావి సీట్లు మీవా..? అని ప్రశ్నించారు ఆర్. కృష్ణయ్య. ఎవరి జనాభా ప్రకారం వారి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు మరిన్ని సీట్లు ఇవ్వాల్సిందిపోయి తగ్గిస్తారా..? అని ప్రశ్నించారు. బీసీలు 2 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. బీసీల వ్యతిరేక వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. ఒకవేళ మారకపోతే ఇవే లాస్ట్ ఎన్నికలని హెచ్చరించారు.

బీసీలకు గోర్లు, చాపలు వద్దని, ముఖ్యమంత్రి పదవి కావాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముదిరాజ్, లింగబలిజలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అగ్రకులాలకు చెందిన వాళ్లు మద్దతు ఇవ్వాలని కోరారు. పేద కులాలను అణచివేసే ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు.