బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి

బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి

బాసర ట్రిపుల్ ట్రిపుల్​ఐటీలో 600 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యానికి గురయ్యారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురయ్యారైన విద్యార్థులకు మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించాలన్నారు. ఈ ఘటనలో బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​చేశారు.

బాసర ట్రిపుల్ ఐటీ పట్ల సీఎం, విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కృష్ణయ్య మండిపడ్డారు. గొప్ప ఆశయంతో వైఎస్ఆర్ ట్రిపుల్ ఐటీ తీసుకొస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఫుడ్ పాయిజన్ వ్యవహారం వెనకాల ఎదో కుట్ర ఉన్నట్లనిపిస్తుంది.. లోతుగా దర్యాప్తు చేయాలి కోరారు. రాష్ట్రంలో గురుకుల హాస్టల్స్ కి కావాల్సిన నిధులన్నీ ఇస్తామని పీఎం నాతో చెప్పారు.. కానీ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆరోపించారు. గురుకుల హాస్టల్స్ కి సొంత భవనాలు నిర్మించాలి. గురుకుల హాస్టల్ మెస్ చార్జీలను పెంచాలని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.

బీసీ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ విషయానికి బాధ్యులుగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని హాస్టల్స్ లో సౌకర్యాలు మెరుగుపర్చాలి. ఫీజు రీ యింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు. సంక్షేమ హాస్టల్స్ లో బియ్యం, కూరగాయలు సరిగ్గా లేవు. క్యాబినెట్ మంత్రులంతా సంక్షేమ హాస్టల్స్ లో పెట్టె తిండి తినాలని ఫైర్​ అయ్యారు. హాస్టల్ మెస్ చార్జీలు పెంచాలి. హాస్టల్స్ లో వర్కర్స్ సరిగా లేరని ఆరోపించారు.