విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు: ఆర్ కృష్ణయ్య

విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు: ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు తప్పవని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26న జరిగే ‘చలో భద్రాచలం –  విద్యార్థి మహా గర్జన’ సభ పోస్టర్​ను బుధవారం ఆయన విద్యానగర్ బీసీ భవన్​లో ఆవిష్కరించారు. 

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, కాలేజీలకు  సొంత భవనాలు నిర్మించి నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు. అరకొర వసతులతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర గ్రాంట్లు ఉన్నప్పటికీ భవనాలు లేకపోవడం బాధాకరమన్నారు. మల్టీ నేషనల్ కంపెనీల సీఎస్ఆర్ ఫండ్స్​తో హాస్టళ్లు, కాలేజీలు అభివృద్ధి చేయాలని సీఎంను కోరారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూరేళ్ల మహేశ్, దామళ్ల సత్యం, నీల వెంకటేశ్, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.