బడ్జెట్‭లో బీసీలకు అన్యాయం చేసిన్రు : ఆర్.కృష్ణయ్య

బడ్జెట్‭లో బీసీలకు అన్యాయం చేసిన్రు : ఆర్.కృష్ణయ్య

కేంద్ర  బడ్జెట్‭లో బడాబాబులకు పెద్దపీట వేశారని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు భారీగా రాయితీలు ఇచ్చారని అన్నారు. రూ.45 లక్షల కోట్ల బడ్జెట్‭లో రూ.2వేల కోట్లు మాత్రమే బీసీలకు కేటాయించడం సిగ్గుచేటన్నారు. 70 కోట్ల జనాభా ఉన్న బీసీలకు ఆ మొత్తం ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. బీసీలు దేశ సంపదలో వాటాదారులే తప్ప బిక్షగాళ్లు కాదని అన్నారు. బడ్జెట్‭లో మార్పులు చేసి బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్దంగా నియమంచిన మండల్ కమిషన్ సిఫార్సులను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్‭లు ఇవ్వకుండా.. హాస్టళ్లు కేటాయించకుండా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.