బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి
  •     మండల్ కమిషన్ సిఫారసులను పట్టించుకోండి
  •    ప్రధాని మోదీకి లేఖ రాసిన ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్,వెలుగు :  దేశంలోని 75 కోట్ల మంది బీసీల అభివృద్ధికి  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీల సమస్యలపై ఆదివారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశంలో అనేక సామాజిక వర్గాలకు మంత్రిత్వ శాఖలు ఉన్నప్పుడు, మెజార్టీ జనాభా అయిన బీసీలకు ఎందుకు ఏర్పాటు చేయరని ప్రశ్నించారు. కేంద్రం కులాల సాంఘిక, ఆర్థిక అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించలేకపోతుందని విమర్శించారు.  

రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ బీసీ కులాల అభివృద్ధికి  ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసినా పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.  కుల వృత్తులకు కులాల వారీగా ప్రతి కుటుంబానికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. లేదంటే బీసీల అన్యాయాలు, అణిచివేత పై దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.