రూ. 5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలి : ఆర్. కృష్ణయ్య

రూ. 5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలి : ఆర్. కృష్ణయ్య
  • ధర్నాలు, నిరసనలు తెలిపినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్,వెలుగు:  బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ రూ. 5 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. మూడేండ్లుగా  పెండింగ్ లో ఉన్నాయని విడుదలకు ధర్నాలు, నిరసనలు తెలిపినా గత ప్రభుత్వం  పట్టించుకోలేదని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం బీసీ విద్యార్థి సేన ఆధ్వర్యంలో  విద్యానగర్ బీసీ భవన్ లో నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ ప్రజాపతి నియమితులైన సందర్భంగా వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, జిల్లపల్లి అంజి, పగడాల సతీశ్,  మోడీ రాందేవ్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.