ఐదు బంగారు పతకాలు గెలుచుకున్న హీరో మాధవన్ కొడుకు

ఐదు బంగారు పతకాలు గెలుచుకున్న హీరో మాధవన్  కొడుకు

ప్రముఖ నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ మరో సారి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. మలేషియా ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ఐదు బంగారు పతకాలు సాధించి రికార్డు సృష్టించారు. కౌలాలంపూర్ లో జరిగిన ఈ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న 17ఏళ్ల వేదాంత్.. (50 మీటర్లు, 100, 200, 400, 1500 ( అన్ని విభాగాల్లో చాంపియన్ గా నిలాచారు. దీనికి సంబంధించిన ఫొటోలను వేదాంత్ తండ్రి, హీరో మాధవన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

బంగారు పతకాలు సాధించిన వేదాంత్ ఫొటోలను మాధవన్ ఇన్స్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
 "దేవుని దయ, మీ అందరి శుభాకాంక్షలతో, వేదాంత్ రెండు వ్యక్తిగత బెస్ట్‌లతో భారతదేశానికి (50, 100, 200, 400, 1500 మీటర్లు) 5 స్వర్ణాలను సాధించాడు. ఈ విజయాలతో అతను ఎంతో ఉల్లాసంగా ఉన్నాడంటూ ఆయన పుత్రోత్సాహంతో పొంగిపోయారు.

వేదాంత్ మాధవన్ గతంలోనే స్మిమ్మింగ్ టోర్నమెంట్లలో పాల్గొని, తన టాలెంట్ నిరూపించుకున్నారు. అంతే కాదు 2022లో జరిగిన 48వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్ షిప్స్ లోనూ వేదాంత్ సరికొత్తం రికార్డు సృష్టించారు. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మహారాష్ట్రం టీం తరపులన ఖేలో ఇండియా 2023లో పాల్గొన్న వేదాంత్.. ఐదు బంగారు, రెండు వెండి పతకాలను గెలుచుకున్నారు.