లాంగ్వేజీ పండిట్​ పోస్టుల అప్​గ్రేడ్​ కోసం ప్రాసెస్ నడుస్తోంది

లాంగ్వేజీ పండిట్​ పోస్టుల అప్​గ్రేడ్​ కోసం ప్రాసెస్ నడుస్తోంది

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని లాంగ్వేజీ పండిట్లు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గ్రేడ్​2 పోస్టులను అప్​గ్రేడ్​ చేయాలని రాష్ర్టీయ ఉపాధ్యాయ పండిత పరిషత్​(ఆర్-యూపీపీ) కోరింది. ఈ మేరకు బుధవారం ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్ రావును ఆర్-యూపీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీ. జగదీశ్, ఎస్.నర్సిములు కలిసి వినతిపత్రం అందజేశారు.

భాషా పండితుల అప్​గ్రేడ్​కోసం సర్కారు జీవో ఇచ్చినా, ఇంకా అమలు కాలేదని ఆర్ యూపీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్ రావు..లాంగ్వేజీ పండిట్​ పోస్టుల అప్​గ్రేడ్​కోసం ప్రాసెస్ నడుస్తోందని తెలిపారు. న్యాయపరమైన చిక్కులను త్వరలోనే అధిగమించి, అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.