RashiKhanna: తెలుగు ఆడియన్స్ మరిచిపోయే టైంలో.. పవన్‌కల్యాణ్‌తో బంపరాఫర్ కొట్టిన రాశీఖన్నా!

RashiKhanna: తెలుగు ఆడియన్స్ మరిచిపోయే టైంలో.. పవన్‌కల్యాణ్‌తో బంపరాఫర్ కొట్టిన రాశీఖన్నా!

టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా (Rashi Khanna) అందరికీ సుపరిచితమే. ఈ మధ్య తెలుగు సినిమాలు చేయడం తగ్గించేసింది. నాగ చైతన్య థాంక్యూ మూవీ త‌ర్వాత రాశీ ఖన్నా తెలుగులో క‌నిపించ‌లేదు. ఇక్కడ  అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో కోలీవుడ్ టూ బాలీవుడ్ రౌండ్లు వేస్తోంది. ఇప్పుడు ఎక్కువ‌గా ఆ రెండు పరిశ్రమల చుట్టే చక్కర్లు కొడుతోంది. అప్పుడ‌ప్పుడు అమ్మడి ఫొటోలు ఇన్ స్టాలో చూసి తెలుగు ఆడియ‌న్స్ మురిసిపోవ‌డం తప్ప హైద‌రాబాద్ లో రాశీ  క‌నిపించింది లేదు.

ప్రస్తుతం రాశీ ఖన్నా తెలుగులో సిద్దు జొన్నలగడ్డతో 'తెలుసు కదా' మూవీ మాత్రమే చేస్తోంది. ఈ క్రమంలోనే  లేటెస్ట్గా టాలీవుడ్ టాప్ హీరోతో రాశీఖన్నా సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా రాశీ ఖన్నా ఎంపికైనట్లు సమాచారం. ఇందుకోసం ఎంతోమందిని పరిశీలించిన మేకర్స్ చివరికి రాశీ ఖన్నాని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో అవకాశాలు తగ్గిన రాశీకి ఇది గోల్డెన్ ఛాన్సేనని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ లేటెస్ట్ షెడ్యూల్లో పవన్‌కల్యాణ్‌తోపాటు, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ఆఫర్తో రాశీ మళ్ళీ తెలుగులో బిజీగా అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. త్వరలో రాశీఖన్నా ఎంట్రీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

రాశీఖన్నా..‘ఊహలు గుసగుసలాడే’మూవీతో  తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జిల్, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, హైపర్, జై లవకుశ, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం, వెంకీమామ, ప్రతిరోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థాంక్యూ తదితర చిత్రాల్లో నటించింది. 

ఇకపోతే, ఉస్తాద్ భగత్ సింగ్లో శ్రీలీల ఫస్ట్ హీరోయిన్‌గా నటిస్తోంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్, హరీష్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో.. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే, రిలీజ్ చేసిన గ్లింప్స్ అంచనాలు పెంచేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.