భైంసా, వెలుగు: నిర్మల్‌జిల్లా భైంసా టౌన్ లో సోమవారం రెండు పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తూ దాడికి పాల్పడ్డాయి. గణేశ్ నగర్, మదీనా కాలనీలో, కడ్డాహోటల్, బస్టాండ్ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్తున్న వారిని వెంటపడి కరిచాయి. సుమారు గంటకుపైగా స్వైర విహారం చేశాయి. దీంతో 25 మందికి పైగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు గాయపడ్డారు.
బాధితులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ విజయానంద్, వైద్య సిబ్బంది చికిత్సలు చేశారు. ఘటనపై తెలియడంతో సబ్ కలెక్టర్సంకేత్కుమార్ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, అధికారులు స్పందించి ఒక కుక్కను చంపివేయగా.. మరో కుక్కను బంధించారు. కుక్కల దాడి టౌన్ లో కలకలం రేపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు
