
ఇన్సటెంట్ లోన్ యాప్ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు . నిందితుల్లో ఒకరు చైనాకు చెందిన వ్యక్తితో పాటు ముంబైకి చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముంబై లో ఓ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వీరి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న రూ. 28 కోట్ల నగదును స్తంభింపచేశారు. మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.