బ్రిటన్ ప్రధాని రేసులో..  జాతివివక్ష ప్రశ్నే లేదు

బ్రిటన్ ప్రధాని రేసులో..  జాతివివక్ష ప్రశ్నే లేదు
  •     పీఎంగా బెస్ట్ పర్సన్​నే కన్జర్వేటివ్ పార్టీ ఎన్నుకుంటది 
  •     పోటీలో వెనకబడ్డా.. ఫైట్​ చేస్తా:  బ్రిటిష్ ఇండియన్ నేత రిషి 

లండన్: బ్రిటన్​లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీలో జాతివివక్ష అన్న ప్రసక్తే లేదని పార్టీ లీడర్​ షిప్, ప్రధాని పదవికి పోటీలో ఉన్న బ్రిటిష్ ఇండియన్ నేత, ఎంపీ రిషి శునక్ స్పష్టం చేశారు. కన్జర్వేటివ్ పార్టీ లీడర్ ఎన్నికకు జరిగే ఓటింగ్​లో జాతివివక్ష అంశం ప్రభావం ఏమాత్రం ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామాతో అధికార కన్జర్వేటివ్ పార్టీ సెప్టెంబర్ 5న కొత్త నాయకుడిని ఎన్నుకోనుండగా.. ఆ పార్టీ ఎంపీ రిషి శునక్, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ బరిలో ఉన్నారు. అయితే, జాతివివక్ష కారణంగా రిషి శునక్ పార్టీ లీడర్​గా ఎన్నికయ్యే చాన్స్ లేదంటూ ఇటీవల ప్రచారం మొదలైంది. అలాగే ఇండియన్ ఆరిజిన్ బిజినెస్ మాన్, పార్టీ డోనర్ లార్డ్ రమీ రేంజర్ ఇటీవల మాట్లాడుతూ.. కన్జర్వేటివ్ పార్టీ లీడర్​షిప్ ఎన్నికలో రిషి ఓడిపోతే బ్రిటన్​ను జాతివివక్ష దేశంగా చూడాల్సి వస్తుందని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో రిషి శునక్  తాజాగా ‘ది డైలీ టెలిగ్రాఫ్’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

ఆస్పత్రికి పేషెంట్లు డుమ్మా కొడ్తే ఫైన్ వేస్తా..

‘‘మా పార్టీ సభ్యులు మిగతా అన్ని విషయాల కంటే ప్రతిభకే పట్టం కడతారు. బ్రిటన్ ప్రధానిగా ఎవరు బెస్ట్ పర్సన్  అన్నదే ఆలోచిస్తారు. జెండర్, జాతి అనేవి ఇందులో ఎలాంటి ప్రభావం చూపించబోవని నమ్ముతున్నా’’  అని రిషి స్పష్టంచేశారు. రేసులో తాను వెనుకబడినట్లు సర్వేలు చెప్తున్నాయని, కానీ పార్టీ సభ్యుల ఓట్లను గెలుచుకునేందుకు ప్రయత్నం కొనసాగిస్తానన్నారు. ప్రధానిగా ఎన్నికైతే బ్రిటన్​ను మరింత అద్భుతమైన దేశంగా మారుస్తానన్నారు. గవర్నమెంట్ డాక్టర్ల అపాయింట్ మెంట్ తీసుకుని, చెకప్​కు రాని పేషెంట్లకు 10 పౌండ్ల ఫైన్ విధించేలా రూల్స్ తెస్తానని ప్రకటించారు.