రాధా కిషన్ రావు వసూళ్ల దందాపై సమగ్ర విచారణ

రాధా కిషన్ రావు వసూళ్ల దందాపై సమగ్ర విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ప్రణీత్ రావు విచారణ భాగంగా... ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావుల ఆదేశాలతో హైదరాబాద్ తో పాటు మరో ఐదు చోట్ల సర్వర్ల ఏర్పాటు చేశారని.. నల్గొండ, మహబూబ్ నగర్ తో పాటు శివారు ప్రాంతంలో సర్వర్లు పెట్టినట్లు విచారణలో తేలింది. కొంతమంది వ్యాపారవేత్తల కోసం సర్వర్లు ఏర్పాటు చేసి.. ప్రణీత్ రావు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైంది. ప్రభాకర్ రావు ప్రైవేటీ సైన్యం పంపి సెటిల్మెంట్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. 

రాధా కిషన్ తన దగ్గర ఉన్న సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా పంపి సెటిల్మెంట్లు చేసినట్లు విచారణలో తేలింది. ప్రభాకర్ రావు, రాధా కిషన్ అధికారులు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ వ్యవహారాన్ని నడిపారని.. పలువురు వ్యాపారులతోపాటు రాజకీయ నాయకుల్ని బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. రాధా కిషన్ రావు వసూళ్ల దందాపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు పోలీసులు. 

కొంతమంది వ్యాపారవేత్తలతో పాటు మాజీ పోలీసు అధికారుల స్టేట్మెంట్లు.. SIB లో పనిచేసిన నలుగురు పోలీసు అధికారుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు పోలీసులు. ప్రభాకర్ రావుకి ఆదేశాలిచ్చిన కీలక నేతల సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాధా కిషన్ కి చెప్పి పలు సెటిల్మెంట్లు చేయించిన పార్టీ నేతల సమాచారాన్ని సేకరించారు పోలీసులు.