పరీక్ష కేంద్రాల వద్ద షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్

పరీక్ష కేంద్రాల వద్ద షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్
  •     విద్యార్థినులను వేధిస్తున్న 22 మంది ఆకతాయిల పట్టివేత

గోదావరిఖని, వెలుగు:  రామగుండం ప్రాంతంలో టెన్త్‌‌ ఎగ్జామ్‌‌ సెంటర్ల వద్ద గత 10 రోజులుగా షీ టీమ్స్​ ఆధ్వర్యంలో డెకాయ్​ ఆపరేషన్​ నిర్వహించి విద్యార్ధినులను వేధిస్తున్న 22 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 10 బైక్‌‌లు స్వాధీనం చేసుకుని 13 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. మరో 9 మంది మైనర్లకు సంబంధించి వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్​ నిర్వహించామన్నారు. ఆకతాయిలు వేధింపులకు గురిచేస్తే డయల్​ 100కు గానీ, రామగుండం షీ టీం నెంబర్​ 6303923700 నంబర్​కు గానీ సమాచారమివ్వాలని సూచించారు.