తిరగబడరసామీ మూవీ నుంచి రాధాబాయి లీరికల్ సాంగ్ రిలీజ్

తిరగబడరసామీ మూవీ నుంచి రాధాబాయి లీరికల్ సాంగ్ రిలీజ్

రాజ్ తరుణ్ హీరోగా ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’. మాల్వీ మల్హోత్రా హీరోయిన్‌‌గా నటిస్తుండగా, మన్నారా చోప్రా కీలక పాత్రతో పాటు స్పెషల్ సాంగ్‌‌లో అలరించబోతోంది. ‘రాధాబాయి’ అంటూ సాగే ఈ పాటను సోమవారం రిలీజ్ చేశారు. భోలే షావలి సాంగ్  కంపోజ్ చేయడంతో పాటు ఆయనే లిరిక్స్ రాశాడు. శ్రావణ భార్గవి పాడింది.

బాయ్ బాయ్ రాధా బాయి.. చెప్తాంటే హాయ్ హాయ్.. అయితాందే మనసంతా గాయ్ గాయ్’ అంటూ సాగిన పాటలో మన్నారా చోప్రా గ్లామర్ లుక్‌‌లో కనిపిస్తోంది. ఆమె చేసిన మాస్  డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి.  మకరంద్ దేశ్‌‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృథ్వీ, ప్రగతి, రాజా రవీంద్ర ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. యూత్‌‌ను ఆకట్టుకునే రొమాన్స్‌‌తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్‌‌ని  అలరించే హై వోల్టేజ్ యాక్షన్  ఎలిమెంట్స్‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శక నిర్మాతలు చెప్పారు.