మగబిడ్డకు జన్మనిచ్చిన నాదల్ భార్య

మగబిడ్డకు జన్మనిచ్చిన నాదల్ భార్య

స్పానిష్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ తొలిసారి తండ్రి అయ్యాడు. నాదల్ భార్య మేరీ పెరెల్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. స్పెయిన్‌లోని ప్రసిద్ధ ఫుట్‌బాల్ క్లబ్ అయిన రియల్ మాడ్రిడ్ ఈ వార్తను వారి అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో పంచుకుంది.ఈ జంట తమ బిడ్డకు 'రాఫెల్' అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తండ్రయిన  నాద‌ల్‌కు టెన్నిస్ వీరుడు నొవాక్ జోకోవిచ్ శుభాకాంక్షలు తెలిపాడు. కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశాడు. 

14 సంవత్సరాల పాటు డేటింగ్ లో ఉన్న నాదల్, పెరెల్లో 2019లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం  స్పెయిన్‌లోని అత్యంత ఖరీదైన రిసార్ట్ 'లా ఫోర్టలేజా'లో  జరిగింది.  పురుషుల సింగిల్స్‌లో  రఫెల్  ఇప్పటి వరకు  22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నాడు. ఏటీపీ పురుషుల ర్యాంకింగ్ లో నాదల్ ప్రస్తుతం రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. మొద‌టి స్థానంలో స్పెయిన్‌కే చెందిన కార్లోస్ అల్క‌రాజ్ గార్సియా ఉన్నాడు.  అటు పెరెల్లో వృత్తిరీత్యా బీమా ఏజెంట్.