ఓ ఇంటివాడైన నడాల్‌ 

ఓ ఇంటివాడైన నడాల్‌ 

మిన్‌‌ ఆర్కా: స్పె యిన్‌ బుల్‌ , టెన్నిస్‌‌ సూపర్‌ స్టార్‌ రఫెల్‌ నడాల్‌ (33)ఎట్టకే లకు ఓ ఇంటి వాడయ్యాడు. తన లాంగ్‌‌టైమ్‌ గర్ల్‌‌ఫ్రెండ్‌ జీస్కా పరెల్లో ను వివాహం చేసుకున్నాడు. స్పెయిన్‌ లోనే అత్యంత ఖరీదైన ఓ కోటలో శనివారం ఈ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, స్నే హితులు, టెన్నిస్‌‌ రంగానికి చెందిన ప్రముఖులతో కలిపి 350 మంది అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పెయిన్ బుల్‌ క్లో జ్‌ ఫ్రెండ్‌, స్విట్జర్లాండ్‌
లెజెండ్‌ రోజర్‌ ఫెడరర్‌ ఈ వేడుకకు రాలేదు.

తన చెల్లెలు మారిబల్‌ బాల్యస్నే హితురాలైన జీస్కాతో నడాల్‌ కు14 ఏళ్లుగా అనుబంధం ఉంది. 2018 మే నెలలో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. తన పర్సనల్‌ లైఫ్‌ ను పెద్దగా బహిర్గతం చేయని నడాల్‌ ..జీస్కాతో కుటుంబాన్ని ప్రారంభించా లని ఉందని కొద్ది నెలల కిందట తన మనసులో మాట బయటపెట్టాడు. పెద్ద టోర్నీలప్పుడు తప్ప నడాల్‌ వెంట జీస్కా పెద్దగా కనిపించదు.