వాయుసేనలో చేరిన రఫేల్ యుద్ధవిమానాలు

వాయుసేనలో చేరిన రఫేల్ యుద్ధవిమానాలు

ఫ్రాన్స్ నుంచి భారత్‌కు వచ్చిన రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం అధికారికంగా ఇండియన్ ఎయిర్ ఫోర్సులో చేరాయి. అంబాలా ఎయిర్ బేస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణమంత్రి ఫ్లోరెన్ పార్లె ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఫ్రాన్స్ రక్షణమంత్రి పార్లె భారత అధికారులచేత గౌరవ వందనం స్వీకరించారు. ఫ్రెంచ్ రక్షణ మంత్రి పార్లె.. రాజ్‌నాథ్‌తో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో అంబాలా చేరుకున్నారు.

ఈ రోజు భారత ఆర్మీలో చేరిన 5 యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి జూలై 27న భారత్‌కు వచ్చాయి. కానీ.. అధికారికంగా మాత్రం నేడు ఎయిర్ ఫోర్సులోకి చేరాయి. ఈ విమానాలు గోల్డేన్ యారోస్‌లో భాగం కానున్నాయి. ఈ రఫేల్ విమానాలకు సంప్రదాయం ప్రకారం సర్వ ధర్మ పూజ నిర్వహించారు. ఆ తర్వాత పైలట్లు విమానాలను వాటర్ సెల్యూట్‌కు తీసుకువచ్చారు. భారత పర్యటనలో ఉన్న ఫ్రెంచ్ రక్షణమంత్రి ఫ్లోరెన్ పార్లె.. కార్యక్రమం తర్వాత భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇండో-ఫసిపిక్ ఏరియాలో భద్రతా, ఉగ్రవాద నియంత్రణపై చర్చలు జరగనున్నాయి.

For More News..

రాష్ట్రంలో మరో 2,534 కరోనా కేసులు

టీ20లలోకి రీ ఎంట్రీ ఇస్తానంటున్న యువరాజ్!

వీడియో: రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. స్టేడియం ముందు వెళ్తున్న బస్‌పై పడింది