ది రేజ్ రూమ్: వచ్చి ఫ్రస్టేషన్ తీర్చుకోండి

ది రేజ్ రూమ్: వచ్చి ఫ్రస్టేషన్ తీర్చుకోండి

కోపం వస్తే కొందరికి వస్తువులను పగలగొట్టే అలవాటు ఉంటుంది, తీరా వస్తువులు చేయి జారాక వాటి విలువ, ఖరీదు తెలిసి చింతిస్తారు.. ఇలాంటి వారి కోసమే సిటీలో ఓ ప్లేస్ కనిపిస్తుంది.. అక్కడికి వెళ్తే చాలు ఫన్ తో పాటు ఫ్రస్ట్రేషన్ కి దొరుకుతుంది, ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడో ఒక్కసారి తెలుసుకుందాం.

మాదాపూర్ లోని రేజ్ రూమ్ లో మీకు నచ్చిన వస్తువులను నచ్చినంతసేపు పగలగొట్టుకోవచ్చు... కోపం తీరేంతవరకు లేదా సరదా తగ్గేంతవరకు సామాన్లను చితక చితకబాదేయొచ్చు.. అదే రేజ్ రూమ్ ప్రత్యేకత. అందుకోసమే ఈ ప్లేస్ కి జనం క్యూ కడుతున్నారు. 

ఇక్కడ మీరు చూస్తున్న ఫ్రిడ్జ్, వాషింగ్  మిషన్ ,స్పీకర్లు, టీవీ, ఫోన్లో లాప్టాప్, కంప్యూటర్లు అన్నీ ఒరిజినల్ ... కానీ పనిచేయవు ... పనిచేయని వాటిని స్క్రాప్ కి వేసే , రీసైకిల్ చేయడం కంటే అదే ఓ బిజినెస్ గా మార్చుకుంటే ఏ విధంగా ఉంటుంది అనుకొని ఈ ప్లేస్ ని ప్రారంభించారు సూరజ్ అనే వ్యక్తి.. ఆలోచన కొత్తది పైగా విదేశాల్లో ఎంతో ఫేమస్ అయిన ఈ ఫన్ ఫ్రస్టేషన్ గేమ్ హైదరాబాద్ కి రావడంతో నగరవాసులు లైక్ చేస్తున్నారు, ప్రారంభించి రెండు నెలలు అయినప్పటికీ వేలాది మందిని ఈ కాన్సెప్ట్ అట్రాక్ చేసింది, తక్కువ ప్రైజ్  లోనే ఇంట్లోనే హోమ్ అప్లయన్స్ ఎలక్ట్రానిక్స్ బాటిల్స్ ఇలా అన్ని వస్తువులు  పగలగొట్టొచ్చు  అని, చితుకు చితుకు అయినంక వాటిని  రి సైకిల్ చేయడానికి పంపిస్తామంటున్నారు.   ఒకసారి ఇలా వస్తువులను తుక్కు చేసాక, మరో సారి దాని ముట్టుకోరని చెప్పారు నిర్వాహకులు.

యూత్ ఈ కాన్సెప్ట్ కి అట్రాక్ట్ అవుతున్నారు.. ఒక్కసారైనా ఈ రేజ్  రూమ్ ను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు. ఇంట్లో వస్తువులను పగలగొడితే ఇంట్లో వాళ్ళు తిట్టడం లేదా ఎందుకిలా చేశామని రిగ్రేట్  ఫీల్ అవ్వడం కామన్.. కానీ ఇక్కడ నచ్చిన వస్తువును తుక్కుతుక్కు చేయడమే పని.. ఉద్యోగాలలో  టెన్షన్ నుంచి రిలీఫ్ పొందడానికి  ల్యాప్ టాప్ లను, సిస్టంలను పెద్ద హేమర్లతో పగలగొడుతున్నారు.  ఇంత బిజీ లైఫ్ లో కోపాన్ని ఎవ్వరిపై చూపించినా పడరు కాబట్టి ఇలా వస్తువులపై చూపిస్తే కాస్త రిలీఫ్ దొరుకుతుందని భావిస్తున్నారు.  పైగా ఒక్కసారైనా కాస్ట్లీ వస్తువును పగలగొట్టామని సంతృప్తి కలుగుతుందనుకుంటున్నారు..

కొంతమంది దీన్ని ఫ్రస్టేషన్ రిలీఫ్ గా భావిస్తే మరి కొంతమంది ఫన్ గా వస్తున్నారు.. ఒక గేమ్ గా తీసుకుంటున్నారు. నచ్చిన వస్తువులను ఇలా  పనికిరాకుండా  చేస్తున్నారు.  ఫ్రెండ్స్ తో కలిసి ఇలా బ్రేక్ చేయడం ఎగ్జిట్ గా ఉందంటున్నారు. సేఫ్టీ ప్రైకషన్స్ కూడా బెస్ట్ గా ఉండడం తో వస్తువుల  పార్ట్స్ తో కూడా ఎలాంటి ఉబ్బంది లేదని అంటున్నారు. సిటీలో మొదటిసారి గా ఇలాంటి  ట్రెండ్ కావడం తో.. మంచి క్రేజ్ కనిపిస్తుంది.