
- అమ్మాయిలా ఉన్నావంటూ సెక్సువల్ హరాస్మెంట్
మేడిపల్లి, వెలుగు: ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు ర్యాగింగ్, సెక్సువల్హరాస్మెంట్చేసిన ఘటన బోడుప్పల్ఎస్ఆర్ బాయ్స్జూనియర్కాలేజీలో చోటుచేసుకుంది. బాధితుడు, అతని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరకి చెందిన గంగాధరి గణేశ్(17) మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ఫస్టియర్ఎంపీసీ చదువుతున్నాడు.
అతన్ని తోటి విద్యార్థులైన మనీష్, జశ్వంత్, ప్రహర్ష హాస్టల్లో మొదటి నుంచి ర్యాగింగ్ చేస్తున్నారు. ప్రైవేట్ పార్ట్స్ పై కొడుతూ.. ఆడపిల్లలా ఉన్నావంటూ సెక్సువల్ హరాస్మెంట్చేస్తున్నారు. చివరికి గణేశ్ఈ విషయాన్ని తన తల్లికి చెప్పాడు. దీంతో ఆమె, బంధువులు ఆదివారం కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.
తన కొడుకు టెన్త్ లో స్కూల్ టాపర్ అని, ర్యాగింగ్, లైంగిక వేధింపుల కారణంగా డిప్రెషన్లో ఉంటూ సరిగా మాట్లాడటం లేదని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ హరీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి అన్వర్, నాయకులు వారికి మద్దతు తెలిపారు.
ఇలాంటి కాలేజీలు, విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. అనంతరం గణేశ్‌ను స్థానిక ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి, వైద్యం చేయించారు. మేడిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్మాట్లాడుతూ.. తోటి విద్యార్థులు బాధిస్తున్న విషయాన్ని గణేశ్తమ దృష్టికి ఎప్పుడూ తీసుకురాలేదన్నారు.
హాస్టల్‌గదిలో అతను, మరో విద్యార్థి కొట్టుకున్నారని విద్యార్థులు తెలిపారని, ఇబ్బంది పెడున్నారని చెబుతున్న పిల్లల తల్లిదండ్రులను కూడా రమ్మని చెప్పామని పేర్కొన్నారు. వారి వివరణ తీసుకున్నాక తదుపరి చర్యలుంటాయని చెప్పారు.