JNTU లో ర్యాగింగ్:  ప్రిన్సిపల్ ఆఫీస్ లో పెట్రోల్ పోసుకున్న విద్యార్ధి

JNTU లో ర్యాగింగ్:  ప్రిన్సిపల్ ఆఫీస్ లో పెట్రోల్ పోసుకున్న విద్యార్ధి

కూకట్‌పల్లి జె.ఎన్.టి.యు.హెచ్. లో ర్యాగింగ్ కలకలం రేపింది. పదిహేను రోజుల క్రితం క్యాంపస్‌లో  ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పై ఫైనల్ ఇయర్ విద్యార్ధి ర్యాగింగ్ కి పాల్పడ్డాడు.  ఈ విషయంపై ప్రిన్సిపల్ కు  ఫిర్యాదు చేయగా… ఫిర్యాదు చేసిన విద్యార్ధినే ప్రిన్సిపల్ డిటెయిన్ చేశాడు. దీంతో అతను మనస్థాపం చెంది ప్రిన్సిపల్ గదిలో ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు.

మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వర్షిత్, నవీన్, రోహిత్ కళ్యాణ్, లను అనిల్ రాజ్ అనే 5వ సంవత్సరం విద్యార్థి ర్యాగింగ్ చేశాడని సమాచారం. దీంతో అనిల్ రాజ్ పై సందీప్ అనే 4వ సంవత్సరం విద్యార్థి ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేశాడు. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తినే ప్రిన్సిపాల్ డిటెయిన్ చేయడంతో సందీప్ మనస్థాపానికి గురయ్యాడు.

ర్యాగింగ్ చేసిన విద్యార్థి పై చర్య తీసుకోకుండా, ఫిర్యాదు చేసిన తన పై చర్య తీసుకోవటంతో బుధవారం మధ్యాహ్నం ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి వెళ్లి సందీప్ పెట్రోల్ ఒంటిపై పోసుకున్నాడు. అది గమనించిన విద్యార్థులు సందీప్ ను అడ్డుకున్నారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకొన్న పోలీసులు సందీప్ ను ఫస్ట్ ఎయిడ్ కోసం సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Ragging in JNTU: A student put petrol himself in Principal's Office

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి