Raghava Lawrence: రైతుల కోసం 'సేవే దేవుడు'..మరోసారి మంచి మనసు చాటుకున్న లారెన్స్‌

Raghava Lawrence: రైతుల కోసం 'సేవే దేవుడు'..మరోసారి మంచి మనసు చాటుకున్న లారెన్స్‌

కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) క్రేజే వేరు. సాయం చేయడంలో ఎప్పుడు ముందుండే లారెన్స్కు సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన సినిమాలు వస్తే ఫ్యాన్స్కి పండగే.ఏ హీరోకు చేయని వేడుకలు చేస్తారు.ఆపదలో ఆదుకోవడానికి ఎప్పుడు ముందుండే లారెన్స్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. నేడు కార్మికుల దినోత్సవం(మేడే) సందర్భంగా తాజాగా లారెన్స్ తన ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేస్తూ 'సేవే దేవుడు' అంటూ తన హుదారతను మరోసారి చూపించారు.

లారెన్స్ మాటల్లోనే.."హాయ్ ఫ్రెండ్స్ మరియు ఫ్యాన్స్, ఈ ప్రత్యేకమైన "కార్మికుల దినోత్సవం" సందర్భంగా, మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా "సేవే దేవుడు"(Service is God)అనే చొరవతో..ఈ ప్రత్యేకమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన దేశానికి వెన్నెముక అయిన రైతుల కోసం మొదటి ప్రారంభంలో 10 ట్రాక్టర్లను నా స్వంత డబ్బుతో అందజేస్తాను. ఈ సాయం అవసరమైన..సరైన వ్యక్తులకు అందజేసి.. ఇలాంటి సేవ చేయడం పట్ల చాలా ఆనందం ఉంటుందని తెలిపారు.

ఈ నిస్వార్థ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ చేరి మాకు మద్దతు ఇవ్వగలరని..ఎందుకంటే, మాటల కంటే మనం చేసే చర్య బిగ్గరగా మాట్లాడుతుంది. అందుకే, నాకు మీ అందరి మద్దతు మరియు ఆశీస్సులు కావాలి. నేటి నుండి 'సేవ దేవుడు' మొదలు! అంటూ రాఘవ లారెన్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.రాఘవ చేసిన మంచి పనితో నెటిజన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. 

కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాఘవ ‘స్పీడ్‌ డ్యాన్సర్‌’తో హీరోగా మారారు. ‘కాంచన’ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన ‘చంద్రముఖి 2’లో సెంగోటయ్యగా కనిపించారు. ఈ ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ కి పరిమితమైంది. గతేడాది రిలీజైన ‘జింగర్తాండ డబుల్‌ ఎక్స్‌’ లారెన్స్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.ప్రస్తుతం ఆయన ‘దుర్గ’ కోసం వర్క్ చేస్తున్నారు.