
రాఘవ లారెన్స్(Ragava Lawrence) మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ చంద్రముఖి 2(Chandramukhi 2 ). పి వాసు( P Vasu) డైరెక్షన్ లో రూపొందుతున్నఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంతం ఆసక్తి కలిగించే ఈ ట్రైలర్ ఆడియన్స్ని మరోసారి చంద్రముఖి గదిలోకి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.
ఈ మూవీ (సెప్టెంబర్ 28న) రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో..గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు ప్రొడక్షన్ హౌస్ హలో హైదరాబాద్! అంటూ ట్వీట్ చేస్తూ..మెగా చంద్రముఖి-2 తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అందరు రెడీ గా ఉండండి! రేపు సాయంత్రం 6 గంటలకు(సెప్టెంబర్ 24న) హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని JRC కన్వెన్షన్స్ లో కలుద్దాం అంటూ పేర్కోన్నారు.
దాదాపు 17ఏళ్ల తర్వాత చంద్రముఖి మూవీకు సీక్వెల్ తెరకెక్కుతుండటం విశేషం. ఈ మూవీలో లారెన్స్ ప్రసెంట్..పాస్ట్ గెటప్స్లో కనిపించబోతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. వెట్టయరాజగా ఫ్లాష్‍బ్యాక్‍లో లారెన్స్ రాజసం చూపించారు.అలాగే చంద్రముఖి, వెట్టయరాజకి మధ్యన ఉన్న 200 ఏళ్ళ నాటి పగను చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
చంద్రముఖి 2 మూవీని తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Hello Hyderabad! 👋🏻 Get ready for a GRAND pre-release event as we gear up for the MEGA Chandramukhi-2 Telugu release! 💥 Tomorrow 6pm at 📍 JRC Conventions, Film Nagar, HYD#Chandramukhi2 🗝️ in Telugu on Sept 28, brought to you by @SriLakshmiMovie! 🎉#Chandramukhi2 #PVasu… pic.twitter.com/1ORsrVyY4m
— Lyca Productions (@LycaProductions) September 23, 2023