
కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) క్రేజే వేరు. సాయం చేయడంలో ఎప్పుడు ముందుండే లారెన్స్కు సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన సినిమాలు వస్తే ఫ్యాన్స్కి పండగే. ఏ హీరోకు చేయని వేడుకలు చేస్తారు.ఆపదలో ఆదుకోవడానికి ఎప్పుడు ముందుండే లారెన్స్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
లేటెస్ట్గా లారెన్స్ తన ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేస్తూ..స్వయంగా ఆపదలో ఉన్న వారి ఇంటికి వెళ్లి, వారి కష్టాలను తెలుసుకుని సేవ చేయడం ఎంతో సంతోషం.నేను నిన్నటి(ఆగష్టు 2) నుండి పని ప్రారంభించాను. నా ప్రజలకు సేవ చేయడం కోసం ఆ దేవుడు నన్ను ఎంచుకున్నందుకు అదృష్టవంతుడ్ని. అందుకు మీ ఆశీస్సులు కావాలి..అంటూ ట్విట్టర్ లో పేర్కోన్నారు.
ఇక ఈ వీడియోలో..పేద ఇంటి పిల్లలకు చదువుకోవడానికి డబ్బుల్లేక,ఇళ్ళులేక బాధపడే ఫ్యామిలీస్ కి భరోసా ఇవ్వడం,వారి స్థితి గతులను తెలుసుకోవడం కోసం స్వయంగా వారి దగ్గరికి వెళ్లిన లారెన్స్ పట్ల సమాజం గర్విస్తుంది.ఇల్లు కట్టుకోవడానికి, వారి ఉపాధి కోసం జీవనం సాగించడానికి ఆర్ధిక సాయం అందజేయడంతో సోషల్ మీడియాలో లారెన్స్ ను నిజమైన దేవుడు అంటూ తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
ప్రజలకి సేవ చేయడంలోనే అసలైన దైవత్వం ఉందనే నమ్మే రియల్ హీరో లారెన్స్. రీసెంట్గా తన ట్రస్ట్కి ఎవ్వరు డబ్బులు పంపించకండి అంటూ వీడియో రిలీజ్ చేసింది తెలిసిందే..మీకు దగ్గరలో డబ్బుల్లేక కష్టపడే ట్రస్టులు చాలానే ఉన్నాయి. నాకు ఇచ్చే డబ్బులను అలాంటి వారికి సాయంగా ఇవ్వండి. వారికెంతో ఉపయోగపడుతుంది.ఎందుకంటే వారికి చాలా మంది సాయం చేయరు..అంటూ లారెన్స్ వీడియోలో మాట్లాడారు.
ప్రస్తుతం రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం చంద్రముఖి 2. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్‌లో నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న సినిమా విడుదల కానుంది. ఈ మూవీ రజినీకాంత్ చంద్రముఖి మూవీకి సీక్వెల్ గా వస్తుండటంతో..చంద్రముఖి 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Hi friends and fans,
— Raghava Lawrence (@offl_Lawrence) September 3, 2023
I had told all of you that I will reach out to those who are in need personally to their houses and serve them. I have started the work from yesterday and I feel extremely happy that god has chosen me to do this service to my people.
Need your blessings ??… pic.twitter.com/oyNiJRl3pO