
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఖో-ఖో సంఘం ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డికి నేషనల్ లెవెల్‌లో కీలక బాధ్యతలు దక్కాయి. ఢిల్లీలో జరిగిన ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సర్వసభ్య సమావేశంలో సౌతిండియా ఖో ఖో అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతో పాటు నేషనల్ ఖో ఖో ఫెడరేషన్ ఎథిక్స్ కమిషన్ కన్వీనర్‌గా కూడా రాఘవరెడ్డి నియమితులయ్యారు. మరోవైపు తెలంగాణ ఖో-ఖో సంఘం జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తికి నేషనల్ ఫెడరేషన్ కార్యవర్గంలో చోటు లభించింది. కరీంనగర్ జిల్లా ఖో ఖో సంఘం జనరల్ సెక్రటరీ మహేందర్ రావు సౌత్ జోన్ ఖో ఖో అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడిగా
ఎంపికయ్యారు.