
రఘు రామ్, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోహీరోయిన్స్‌గా సత్యనారాయణ ఏకరీ దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓహ్’. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘కులుమనాలి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ ఇది.
ఇప్పటివరకు కులుమునాలి, ఆగ్రా, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో షూటింగ్ చేశాం. ఈ నెల 10 నుండి వరంగల్‌లో రెండు ఫైట్స్, ఆ తర్వాత గోవాలో మరో పాట తీయనున్నాం. సెప్టెంబర్ 29న థియేటర్స్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. అందమైన మంచుకొండల్లో షూటింగ్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని హీరో హీరోయిన్స్ చెప్పారు.