హైదరాబాద్ లో రఘు వంశీ ఏరోస్పేస్ కొత్త క్యాంపస్షురూ

హైదరాబాద్ లో రఘు వంశీ ఏరోస్పేస్ కొత్త క్యాంపస్షురూ
  • రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి
  • ఆరు స్వదేశీ యూఏవీలు లాంచ్​​

హైదరాబాద్​, వెలుగు: రఘు వంశీ ఏరోస్పేస్ గ్రూప్ తన కొత్త బ్రాండ్​ ఆరోబోట్ ద్వారా రక్షణ తయారీని విస్తరించింది. హైదరాబాద్ ఎయిర్​పోర్టు సమీపంలో నిర్మించిన డెవలప్​మెంట్​, ప్రొడక్షన్​, సిస్టమ్స్​ ఇంటిగ్రేషన్ క్యాంపస్‌‌ను సోమవారం ప్రారంభించింది. దీనికోసం రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది.  పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఆరో బ్రాండ్ ​పేరుతో రూపొందించిన ఆరు మానవరహిత, అటానమస్​ డిఫెన్స్​ ప్లాట్‌‌ఫారమ్‌‌లను ఆవిష్కరించింది.  

జెట్-శక్తితో నడిచే లాయిటరింగ్ మందుగుండు సామగ్రి, టార్గెట్ డ్రోన్‌‌లు, లాంగ్ -ఎండ్యూరెన్స్ కమికేజ్ యూఏవీలు, అన్‌‌మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ (యుజీవీలు) వీటిలో ఉన్నాయి. వీటి ఆపరేషనల్ పరిధి 300 కిలోమీటర్లు. ఈ గ్రూప్ 515 ఆర్మీ బేస్ వర్క్‌‌షాప్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), ఐఐఐటీ హైదరాబాద్, ఏఆర్​సీఐ సంస్థలతో నాలుగు ఎంఓయూలు కుదుర్చుకుంది. 

ఇదిలా ఉంటే,  హైదరాబాద్​ హార్డ్‌‌వేర్ పార్క్‌‌లో రూ.300 కోట్ల పెట్టుబడితో యూఏవీలు, ఇంజిన్లు, అధునాతన రక్షణ వ్యవస్థల కోసం డిజైన్- టు- అసెంబ్లీని నిర్మిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.