తొలి రోజు నామినేషన్ వేసిన రఘునందన్ రావు, డీకే అరుణ

తొలి రోజు నామినేషన్ వేసిన రఘునందన్ రావు, డీకే అరుణ

 తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. తొలి రోజు బీజేపీ అభ్యర్థులు రఘునందన్ రావు, డీకే అరుణ, ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు.

మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, మెదక్ ఎంపీఅభ్యర్థిగా రఘునందన్ రావు, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ లో నామినేషన్ వేశారు అభ్యర్థులు. ఇక కరీంనగర్  లోక్ సభ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి కోట శ్యాం కుమార్ నామినేషన్ వేశారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే కలెక్టరేట్ లోకి అనుమతిస్తారు. 

 తెలంగాణలో ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 29న ఉపసంహరణకు గడువు. మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.