వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చాం: రఘునందన్ రావు

వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చాం: రఘునందన్ రావు

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితుల వివరాల్ని కేంద్రా బృందాలకు ఇచ్చినట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. ఆగస్టు 3న ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..  వరదల్లో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో రైతులు పంటలు నష్టపోయారని.. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు పరిహారం ఇవ్వట్లేదని ఆయన ఆరోపించారు. 

ఏడుగురు సభ్యులతో కలిగిన బృందం రాష్ట్రానికి వచ్చినట్లు చెప్పారు.  5 జిల్లా్ల్లో 3 రోజుల పాటు పర్యటించినట్లు తెలిపారు. ఆగస్టు 4న కేంద్ర హోం మంత్రి రాష్ట్రంలోని వరద పీడిత ప్రాంతాల నివేదిక ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వరదల్లో నష్టపోయిన వారికి త్వరగా సాయమందిచాలని కోరినట్లు రఘునందన్ తెలిపారు. 

సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే 41 మంది మృతి.. : ఈటల రాజేందర్

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే భారీ వర్షాల వల్ల 41 మంది మృతి చెందారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. పంటలు, ఇళ్లు మునిగిన వారికి నష్టపరిహారం ఇవ్వడంపై ప్రభుత్వం స్పందిచట్లేదని ఆయన అన్నారు. వరద మిగిల్చిన నష్టంపై కేంద్రానికి  తాను నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.