వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వలేదు

వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వలేదు

మంచిర్యాల,వెలుగు: వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు డిమాండ్​ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ముంపు బాధితులు మంగళవారం కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్​రావు మాట్లాడుతూ మంచిర్యాల, వేంపల్లిలో వరదలు వచ్చి 15 రోజుల దాటినా ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్​జిల్లాలో పర్యటించి ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థికసాయం చేయాలని, జిల్లాకు రూ.5 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని, సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

వరదలు వచ్చిన ఇతర జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్.. మంచిర్యాల జిల్లాకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సీఎంను జిల్లాకు తీసుకురావడంలో ఎమ్మెల్యే దివాకర్​రావు విఫలమయ్యారన్నారు. నష్టపరిహారం ఇవ్వకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేపీ లీడర్లు మున్నారాజ్​ సిసోడియా, పొనుగోటి రంగారావు, ఆరుముల్ల పోశం, మోటపలుకుల తిరుపతి, రజినీశ్​ జైన్, రేకందర్ వాణి, గుండా ప్రభాకర్, మాధవరపు రమణారావు, తుల ఆంజనేయులు, వంగపల్లి వెంకటేశ్వర్​రావు, అగల్​డ్యూటీ రాజు, బొప్పు కిషన్, బొలిశెట్టి తిరుపతి, బొద్దున మల్లేశ్, జోగుల శ్రీదేవి పాల్గొన్నారు.