వివేక్ వెంకటస్వామిపై ఈడీ దాడులు ఖండిస్తున్నాం: తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక

వివేక్ వెంకటస్వామిపై ఈడీ దాడులు ఖండిస్తున్నాం: తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక

మంచిర్యాల: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై ఈడీ దాడులను తీవ్రంగా ఖండించారు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరెడ్డి. తెలంగాణ ఉద్యమసమయంలో ఉద్యమకారులను ప్రోత్సహించిన ఘనత  వివేక్ వెంకటస్వామిదన్నారు రఘురామరెడ్డి. చెన్నూరు పట్టణంలో రేపటి నుంచి( నవంబర్24)  తెలంగాణ అమరు వీరుల ఆశయ సాధన యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా రఘురామరెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ కారుడిగా చెప్పుకుంటున్న బాల్క సుమన్ ఉద్యమకారులకు చేసిందేమి లేదని.. తెలంగాణ ఉద్యమకారులను ప్రోత్సహించిన ఘనత వివేక్ వెంకటస్వామిదని అన్నారు. బాల్క సుమన్ ఒక్కడే ఉద్యమకారుడా.. ఉద్యమం పేరుతో వేలకోట్లు సంపాదించిన నీచ చరిత్ర బాల్క సుమన్ దని విమర్శించారు. టీఎస్ పీఎస్సీ పరీక్షలు ఎందుకు రద్దు అయ్యాయి.. నిరుద్యోగుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావని ఏనాడైనా బాల్క సుమన్ నిరుద్యోగుల తరపున కేసీఆర్ ను ప్రశ్నించిన పాపాన పోలేదని రఘురామరెడ్డి ఆరోపించారు. పదవులకోసం, సంపాదన కోసం ఉద్యమకారుల ఆత్మ గౌరవాన్ని సీఎం కేసీఆర్ కాళ్ల దగ్గర బాల్కసుమన్ తాకట్టు పెట్టారని చెప్పారు.

నిజానికి ఐటీదాడులు, ఈడీ దాడులు జరగాల్సింది కేసీఆర్ కుంటుంబ పైన.. తొమ్మిదేళ్లుగా లక్ష లకోట్లు దోచుకున్నారు వారి ఇండ్లపై జరగాలి ఈడీ దాడులు అని రఘురామరెడ్డి అన్నారు. తెలంగాణ రాకముందు లేని సంపద ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ బినామీలు మెగా కృష్ణారెడ్డి, మై హోం రామేశ్వరరావులకు లక్షల కోట్లు దోచుపెట్టారని.. అటువంటి వ్యక్తులపై ఎందుకు ఈడీదాడులు జరగడం లేదు.. దళిత బిడ్డలైన వివేక్ వెంకటస్వామిపై ఐటీ దాడులు చేయడం ఏంటనీ ప్రశ్నించారు రఘురామరెడ్డి.