నేను కాంగ్రెస్.. నా రక్తం కాంగ్రెస్ : రఘువీరా

నేను కాంగ్రెస్.. నా రక్తం కాంగ్రెస్ : రఘువీరా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారంటూ వచ్చిన వార్తలను ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కొట్టిపారేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఆయన మీడియాతో మాట్లాడారు. “కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానా లేదా అన్నది తమ పార్టీకి సంబంధించిన అంశం అన్నారు. నేను కాంగ్రెస్ వాణ్ని.. నారక్తం కాంగ్రెస్. చివరి ఊపిరి ఉన్నంతవరకు.. ఓపిక ఉన్నంతవరకు .. పార్టీ మారను. రాజకీయాలు చేసే ఓపిక ఉన్నంతవరకు కాంగ్రెస్ లోనే ఉంటా” అని ఆయన స్పష్టత ఇచ్చారు.